ఆదివారం, ఏప్రిల్ 01, 2012

శివ ధనుర్భంగ పెళ పెళ ఆర్భాటములు-శివ ధనస్సు - ఇదో గొప్ప ఇంద్రధనస్సు అన్ని రసాలను కలిపిన మహా షడ్రసం .
శివ ధనుర్భంగ పెళ పెళ ఆర్భాటములు


వర మాల తో నున్న సీతమ్మ కు ...
మంగళ తుర్యములై  తోచే . 


నిరుతత్తలో నున్న రాజవరేన్యులకు...
ప్రళయ కాల మేఘ గర్ఘోషలై తోచే .


వర చింత లో  నున్న జనక మహారాజు కు .....
హృదిలోని చింత లన్ని బాపే   అతి పెద్ద చిటిక  ధ్వని లా తోచే .


హేయంగా ఓడిన రావణాసురునకు  ....
ప్రళయ కాల రుద్రా ఘంటికలా తోచే .


ఆహ (.. అని  ఆశ్చర్యంగా చూసే మనకు ....
భయానంద డోలికా రవములై  తోచే .


ఇంతమందికి ఇన్ని ఇంద్ర ధనువుల నొసగే ఆ శివ ధనుస్సు 


శివ ధనస్సు -
ఇదో గొప్ప ఇంద్రధనస్సు అన్ని రసాలను కలిపిన మహా షడ్రసం .