ఆదివారం, ఏప్రిల్ 29, 2012

సేద తీరంగా రావేమి చల్ల చల్లంగా రావేమి

నవమి దాటినా ఇంకా రానే రావేమి ఈ వానలు 
వస్తే వడగండ్ల వాన లేదా సుడిగాలి  జత తోనా 
పంటలు తోటల నాశనం రైతులకు యమ పాశం 

చల్ల చల్లని వాన చల్లంగా రావేమి 
పుడమి తల్లికి  నిండ సేదతీరంగా  రావేమి 

పశువులు పక్షులు మానులు మనుషులు 
క్రిమి కీట కాదులు సర్వ జలచరులు వనచరులు 
సేద తీరంగా రావేమి  చల్ల చల్లంగా రావేమి 

గిరులు ఝరులు నిండు కోనేరులు కుంటలు 
నిండుకున్నాయి  ఎండి బోసి పోయాయి 
సేద తీరంగా రావేమి  చల్ల చల్లంగా రావేమి 


రాముడివి రహీమ్ వి  అల్లావు యేసువు 
అన్ని దేవుళ్ళ నీవే అందరి దాహార్తి నీవే 
సేద తీరంగా రావేమి  చల్ల చల్లంగా రావేమి