బుధవారం, మే 09, 2012

తెల్ల జండాలో తెలివితేటలేన్నో బ్రిటిషు వాడు నేర్పాడు ఓర్పుగా నేర్చుకో

     రాజకీయపు ఆట 

రాజకీయపు  చదరంగంలో  బంటులే  గుదిబండలు  

చుట్టుకుంటాయి  మెడ  చుట్టూ  ఉరి తాల్లై  

ఇది ఒక పద్మవ్యుహమా అది ఒక  కురుక్షేత్ర  యుద్దమా 

అబిమన్యులా ఒరిగి పోతావో  అర్జునిలా  విజ్రుమ్భిస్తావో 

కీర్తి పై ఒక  వేటు  ఆర్ధిక  వనరుపై  ఒక  వేటు 

మూకుమ్మడి  ముప్పేట  దాడితో  ఆయువుపై  ఆఖరి  వేటు 

బ్రూటసుల బృందాలే  ఎక్కువ శకుని మామలే  మక్కువ  

చేసిన  ఒక  పొరపాటు వేసిన  ఒక  తప్పుడు  రాజకీయపు ఎత్తుగడ 

రణ  క్షేత్రంలో  అభిమన్యుని గా నిలిపాయి అర్జునిగా రాణించాలంటే 
రాజీ రాజకీయపు ఎత్తు  వేయాలి 

తెల్ల జండాలో  తెలివితేటలేన్నో బ్రిటిషు వాడు నేర్పాడు ఓర్పుగా నేర్చుకో