సోమవారం, మే 07, 2012

కన్నీళ్ళు - చంద్రశిలావ్రత ధార

కన్నీళ్ళు 

ఎదలోయలలో సడి చేయక  
వడి వడి సుడులు తిరుగు సాగే ఒక  అసిధారా స్రవంతి 

మది ఊ హలలో ఉవెత్తున ఎగిసే
ఉసుల బాసల ఊపిరాడని ఒక వుక్కిరిబిక్కిరి విపంచి

నయన గోళాలలో నర్తన చేసే 
భావ భాధా తరంగాలై  ఉ రికే ఒక భావజల తరంగిణి 

అగ్గ్నిశికలై జ్వాలాముఖి సముఖై జ్వలించే 
హృదయా బడబాగినుల చప్పున చల్లార్చే     చంద్రశిలావసి ధార 


కన్నీళ్ళు కనుకొలనుల జారే కమనీయ దృశ్య కావ్యాలు 

కన్నీళ్ళు ఎరుపెక్కిన కన్నుకొనలనుంచి జారే దయనీయ దారుణ దృష్టాంత దృశ్యాలు