బుధవారం, మే 02, 2012

వానప్రస్థం - వార్ధక్క్యం

వానప్రస్థం - వార్ధక్క్యం 

తోలి పొద్దుల తోలి ముద్దుల ప్రతి రూపాలు నీ కంటి పాపలు  
మలి సంజన చలి కాగి కోరలు సాచిన కాలబైరవ స్వరూపాలు 

కాచుకున్నారు కాటికంపే కాటికాపరులు నీ కంటి పాపలు 

కాల యముని  కాల మహిష  గంటికలు మ్రోగక మునుపే 

చిరంజీవ చిరంజీవ అనే దీవనలు నిన్ను దిక్కులేని వాణ్ని చేసాయి 
నీ పై వారు నీ తరము వారు కాల గర్భాన కలిసి నిన్ను ఒంటరిని చేసారు 

సుఖీభవ సుఖీభవ అనే  దీవనలు నీకు దక్కలేదు రెక్కలిరిగిన పక్షివై రాలినావు  
చిక్కరాదు చిక్కరాదు అనుకుంటూ చిట్టచివరికి  చిక్కినావు శ్యలమై మిగిలినావు 

పిల్ల పాపలు నీ పాలిటి నిత్య మృత్యుఘోషా శంకారవాలు  
నీ కంటి పాపలు నీ కన్ను పొడిచేటి కరాళ కాల పాశాంకురాలు