ఆదివారం, మే 13, 2012

దేవుడు కూడా సరిరాడు అమ్మ ముందు

అమ్మ   అనే  పదం  ఒకరు  వ్రాసింది  కాదు  వేరెవరో  సృష్టించింది  కాదు This image was selected as a picture of the we...

పాలు గారే  పసిపాప  గులాబి రేకుల  లేత  పెదవుల  ధ్వని  నుంచి  పుట్టింది 

" ఉమ్  ఉమ్  ఉమ్మా కాస్తా  అమ్మ  అయి ఆవిష్కరించింది "

అమ్మ   అనేది  ఒక  సుమధుర  రాగం , అది  ఒక  జీవన  గీతం 

అమ్మే  లేకుంటే  ఈ  జీవితమే  లేదు .


అందరు  ఆద   మరచి  నిదురించిన  నిదురలోనే  మేలుకొని  వుండేది  అమ్మ   

మనము  ఎలా ఉన్నామో  ఎలా  ఉంటామో  అనే  నిరంతర  మన  ధ్యాస  తో 

నిదురలో  కూడా  ఏమి  మనకు  అవసరం  అవుతుందో అనే  ధ్యాస  తో  

మరణము లో  సహితం  మన  హితమే  కోరేది  అమ్మ  వాడు  వచ్చాడా , 

వీడు  ఆకలికి  తాళ  లేడు   దానికి  భయమేక్కువ  అది  చిన్నది  వీడు ....

ఎన్నో ఎన్నెనో  పలవరించత లు , కలవరింతలు  అదీ  అమ్మ  అంటే .

ఆకాశానికి  ఆవలి తీరం  ఏమిటంటే  మనకు  కనిపించేది   అమ్మే 

భూమాతకు  మించినది   ఎవరంటే  మనకు  దొరికేది   అమ్మే 

భూ  ఆకాశాలు  కోపం  వస్తే  ప్రకృతి  విలయం  పేరుతొ  విరుచక  పడతాయి 

అమ్మ   ఎప్పుడు  అలా  చేయదు  దండించటం  కూడా  దయతోనే  

దేవుడు  కూడా  సరిరాడు  అమ్మ   ముందు 

అమ్మ  / మదర్  = నీ  మదర్  టంగు , నీ  ఐడెంటిటి , నీ  ప్లేసుమెంటు , నీ  బేసుమెంటు .