గురువారం, మే 10, 2012

ప్రజలు ఎవరిని చూసి నేర్చుకోవాలి యేమని నేర్చుకోవాలి

వార్తలు చూసారా   
పేపర్లు తిరగేసార  
రచ్చ  బండ  చర్చ  కన్న
కనా కష్టంగా  వుంది 

మా వీధిలో  అమ్మలక్కలు 
ఇంతకన్నా  చక్కటి  విమర్శ  చేస్తారు 
మా రచ్చ బండ  పెద్దలు 
ఇంతకన్నా  చక్కటి  సలహాలు ఇస్తారు    

బురద  చల్లుకొనే  ఆటలో  కూడా 
న్యాయ  సూత్రాలు  వుంటాయి  గమనిస్తే 
నాయకులూ  మీరే  ఇలా  రచ్చ  రచ్చ   చేసుకుంటే 
ప్రజలు  ఎవరిని  చూసి  నేర్చుకోవాలి  యేమని  నేర్చుకోవాలి