బుధవారం, మే 23, 2012

నేను మీ వికృత స్వరూపాన్ని

Fire World

గగనతలం నా  ఛత్రం -  దిన  పాలకులు  నా  దిక్పాలకులు 

కాలం నా ముంజేతి  కంకణం - యమపాశం  నా  చేతి  శూలం 

నిత్యాగ్నిహోత్రాలు  నా  రెండు  కళ్ళు - బుగబుగలు  బుసబుసలు  నా  దీర్గశ్వాసాలు 

రుద్రులకు  రుద్రుడను  మహావీర  భద్రుడను - నేనే  ప్రళయకాల  ఘోషా  సముద్రుడను 

నా ధీర్ఘ   బాహువులు  ఉప్పొంగే  ఉప్పెనలు  -  నా  దీర్ఘ  శ్వాసలు  సుడులు తిరిగే వడగాడ్పులు 

నా ఉదరాగ్ని గోళాలు బడబాగ్నులు చిమ్ము -  నా  పదఘట్టలు భునభొంతరముల  కుదుపు 

మీ  పాపపంకిలల  ప్రతిఫలాన్ని - మీ హ్రుదయాన్తరంగాల  చీకటి  కోణాన్ని 

మిమ్ము  దహియించ  వచ్చిన  మీ  భస్మాసుర  హస్తాన్ని - నేను  మీ  వికృత  స్వరూపాన్ని