ఆదివారం, జూన్ 10, 2012

చట్టం కళ్ళు ఎదురుగా విడివడి పోయే

యెట్టకేలకు  వివాహబంధం  తెగిపోయింది  
న్యాయం చట్టం సాక్షిగా 
బాసలు ఆశలు  అడియాసలు అయ్యాయి 
కలలు కోరికలు కన్నీటి చుక్కలై  దొరలిపోయాయి 

పాషాణ హృదయం కటిన కాసారమై పోయే 
కన్నీరు వరద కూడా కడగలేక పోయే 
బంధాలు బాంధవ్యాలు బందనాలను నిలుపలేక పోయే 
సుడి గాలిలో చిగురాకులా చిరిగి చిరిగి పెలికలైపోయే 

అహంకారం ముందు మమకారం ఆవిరైపోయే 
అవివేకము  ముందు  వివేకం విస్తుపోయే 
అనలోచితలలోకంలో అనాలోచిత సుడిగుండంలో 
అన్ని ఆశలు ఆశయాలు వడి వడి గా సుడి వడి పోయే 

విడాకులే మామిడాకులై వియోగమే సమాగమై 
చట్టం కళ్ళు ఎదురుగా  విడివడి పోయే