బుధవారం, జూన్ 20, 2012

ప్రకృతి

తొలకరి వానలతో

వనాలు , గిరులు , ఝరులు

పులకరించి  పోతున్నాయి

తడిఆరిన  గొంతులు

మెలమెల్లగా  లేస్తున్నాయి

కుహు  కుహు  రాగాలతో

కొండలు కోనలు  మారుమ్రోగి  పోతున్నాయి

నింగి  ఘాడ పరిష్వంగంలో

నేలతల్లి  పరవశించి  పోతున్నది

ప్రకృతి కాంత లా  పరుగులు  తీస్తున్నది