సోమవారం, జూన్ 11, 2012

మృత్యువు


మృత్యువు  కౌగిలి  కోరేవారు  ఏ  కోరికల కై  పరుగులు  తీయరు 


అసహాయ  జీవుల  అంతరంగ తరంగం లో  ఆఖరి అంకం  అదే 


కాలయముని  కరుణా  కటాక్ష కొరకు  ఊపిరి  ఉగ్గ  బట్టి  బ్రతుకు  బండి లాగుతుంటారు 


ఆఖరి ఘడియల  ఆవిష్కారానికి  ఆశకావేశాలతో  రగిలి పొగిలి పోతువుంటారు 


జుగుప్స  గగ్గుర్పాటు  ఏవగింపు  ఏడ్పు  కలగలసి  జీవిత చరమాంకం  అంచుల  అటునిటు  ఊగి  పోతారు 


నిస్సహాయులై  నిసృహుల  నిట్టురుపుల  నిప్పులలోన  మగ్గి  మగ్గి  మసి  బారి పోతారు 


ఏ స్పర్స  స్వాంతన  నివ్వదు  ఏ  మందు  పని  చేయదు  యమ కర స్పర్స తప్ప