సోమవారం, మార్చి 30, 2015

అగ్ని సంస్కారం

 

 

అగ్ని కీలలలో 

భగభగమని  మండేది 

శరీరం లోని సకల కల్మషాలు

అగ్ని పాయలలో 

భుగభుగమని ఎగసి పడేది 

శరీరాన్ని ఆశ్రయించు కొన్న బంధనాలు  

అగ్ని సంస్కారంతోనే  ఆత్మ ఆవిష్కృతం అవుతుంది  

మౌన సంస్కారం తోనే అంతరాత్మ గోచరం అవుతుంది