శనివారం, మార్చి 28, 2015

రామా రావయ్యా మా ఒంటిమిట్టకు


 

రామా 

రావయ్యా

మా ఒంటిమిట్టకు 

మా ఆనంద భాష్పాలు తప్ప 

గోదావరి లేదు నీ కాళ్ళు కడుగ 

మా హృదయ పీటం తప్ప

భద్రాది లేడు నీకు పీట వేయ 

చిరు కానుకలు తప్ప 

చింతాకు పతకం తేలేము 

నీ నామా  సంకీర్తన తప్ప

రామదాసు నగలు చేయించలేము

 ఈ ఒంటి మిట్టనే నీ పంచవటి అనుకోని 

మా హృదయ రాజ్యాన్ని నీ మహాసామ్రాజ్యం అనుకోని

 రామా 

రావయ్యా

మా ఒంటిమిట్టకు 

మీకు మీ కుటుంబానికి  శ్రీ రామ నవమి శుభాకాంక్షలు