మంగళవారం, మార్చి 24, 2015దేవుడంటే 

నాకేం పెద్దగా ప్రేమ లేదు 

అలాగని నేను నాస్తికుడుని కాను 

మానవత్వాన్ని అమితంగా ప్రేమిస్తాను అంతే  !

నేనేమి 

పెద్ద వేదాంతిని కాను 

అయితే అర్థాలు వెతుకుతూ

జరిగినదానికి - జరుగుతున్నదానికి 

అర్థాలోచనలో పడి వేదాంతం మాట్లాడను 

వాస్తవాన్ని గమనిస్తాను , గ్రహిస్తాను -శ్వాసిస్తానుఅంతే !

పరలోకపు పారమార్థ్యం కన్నా 

ఈ లోకపు పరమార్థాలు మిన్న అని నమ్మే  సాధారణ  రైతును  

(గౌరవనీయులు సుబ్బా రావు గారు సెలవు తీసుకున్నారు  )