మంగళవారం, మార్చి 10, 2015

ఎర్ర మందారలై పూచినాయి

 

చెలి  !

ఇంకా 

రాడేమి

నా నెలరేడు!!

నింగినేలు రాజు

నేల జారుతున్నాడు

చుక్కలన్నీచట్టుక్కున మాయమౌతున్నాయి

కంటి కాటుకలా

చుట్టూఉన్నచీకటి మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంది 

ఎదురు చూసిన కన్నుల 

వేకువ జాము ఎరుపు జీరలు పరుచుకుంటున్నాయి 

చెలి  !

ఇంకా 

రాడేమి

నా నెలరేడు!!