బుధవారం, అక్టోబర్ 27, 2010

SREE VALMEEKI RAMAYANA - BALA KANDA chapter I [2]


ఆ మహర్షి పలుకులు విని , వాల్మీకి  శ్రీ రామచంద్రుని గురించి , అతని గుణములు గురించి తెలియ జేయ   వలసినదిగా ప్రార్థించెను .సద్గుణ సంపన్నుడు సర్వ మంగళ కారుడు , సదా  సత్య వ్రత నిరతా దురంధ రుడు , సలక్షనుడు విశాల నేత్రుడు , సింహ వక్ష్టలము గలవాడు , సింగాపు నడుము గలవాడు , విశాల నుదురు గలవాడు చక్రవర్తి కీరిట దార శిరసు గలవాడు , గుండ్రని ఎదుభుజములు గలవాడు , చక్రవర్తుల కే చక్రవర్తి, దేవతల కే దేవుడు ఐన వాడు , మాతా కౌసల్య ఆనందవర్ధనుడు , దశరథ మహారాజ ప్రియ జేష్ట  సుతుడు , ఇక్ష్వాక వంశజుడు, ఐన ఆ ఆనంద రాముని గన, వేయీ కన్నులు చాలవు అని ఎంతో తాద్యతముతో ఎంతో గొప్ప గా, నారద మహరిషి వర్ణిస్తూ వుంటే , వాల్మీకి రుషి ఆనంద దోలికలలో తేలిపోయాడు . అటువంటి అందరికి ప్రీతి పాత్రుడు , అందరి ప్రేమపాత్రుడు ఐన శ్రీ రామునుకి యువ రాజ్యాభిషేకం  చేయవలసిన  సమయము ఆసన్న మై నందున , అందరి కోరిక, కాంక్ష మేరకు , సంబరాలు ఏర్పాటు  చేయటము గని , మాతా కైకేయ, తనకు ఇదివరలో ఇచిన రెండు వరములను కోరి , మొదటిదిగా రాముని - వివాసము , రెండవదిగా  భరతుని- పట్టాభి షేకము చేయ వలసినదిగా  ,దశరతుని    కోరినది . సత్య వాక్య పాలకుడు కావటము వల్ల, తండ్రి ఆజ్ఞ పై  రాముడు వనములకు వెడలెను.