గురువారం, ఆగస్టు 02, 2012

వెలుగు తెచ్చే ధైర్యం


పశ్చిమాద్రి లో  పర్వతాల  అనుంచు నుంచి 


జాలువారుతోంది  వెలుగు రేఖ నెమ్మది నెమ్మదిగా 


ఆవురావురు మంటూ  పెను చీకటి  ఒడలు విరుచుకుంది 


వెలుగు రేఖలను  అమాంతం  తనలో   కలుపుకుంది 


నిశ్చేటలైన  జీవరాసులు  గుంపులు గుంపులు  గూటికి  చేరుకున్నాయి .


బిక్కు బిక్కు మని  దాకున్నాయి 


ఉషోదయం లో  మళ్ళి  వచ్చిన  సూర్యుణ్ణి  చూసి  కిల కిలా  రావాలతో 


కలకలములు   శ్రుష్టించాయి .


వెలుగు  తెచ్చే  ధైర్యం 


చీకటి  పెంచిన  భయాన్ని  తొలగించింది .