ఆదివారం, జులై 29, 2012

చచ్చేదాకా చపలత్వం పోదు .
కోరికలు నాగుపాములై  బుసలు కొడుతుంటే 


శిఖరాగ్రాన  నుంచున్నా  సహాయం  కొరకు 


అర్థించే  చేతులకు  ఆలంబనగా  మేఘమాల  వారధి  పరిచే 


అయినా  చపలత్వం  చావలేదు 


కోరికలలో  మునిగి  లొంగి పొవాలో  


ఆ అమృత  హస్తాల  నందుకొని  ఆవలి  తీరం  చేరాలో 


చపలత్వం  చావదు 


చచ్చేదాకా  చపలత్వం  పోదు .