శుక్రవారం, జులై 27, 2012

సిగ్గు చేటు కాదా ............

పాండవులు  పడరాని పాట్ల  పడ్డా  ధైర్యం  కోల్పోలేదు 


పాంచాలి  పరుల పంచన  దాస్యం  చేసినా ఖిన్నత పొందలేదు 


అరివీర  భయంకరుడు  బృహన్నలైన  దుఖించలేదు  


కొండలనే  పిండి చేసే  భీముడు  వంటవాడైన  వగచలేదు  


వారికన్నా  గొప్పవా  మన కష్టాలు  ....................


ఈ  మాత్రనికేనా  పిరికి పందలై  వుసురులు  తీసుకుంటున్నాము 


సిగ్గు చేటు  కాదా ............