గురువారం, జులై 31, 2025

🌿 మనసే ఓ చిలుక

🌿 మనసే ఓ చిలుక








🕊️
మనసే ఓ చిలుక అయితే...
పంజరమే జీవితం అవుతుంది...
ఎక్కడికో పారిపోవాలనిపిస్తుంది...

💫
మనసే మమతల కొలువైతే...
ఇల్లే భోలోక స్వర్గం అవుతుంది...
జీవితమే ఆనందాల హరివిల్లుగా మారుతుంది...

📿
– మ. మురళి మోహన్

ఆదివారం, జులై 13, 2025

🎵 శ్రీ రాఘవేంద్ర! పాహి మాం – రక్ష మాం 🎵

🎵 శ్రీ రాఘవేంద్ర! పాహి మాం – రక్ష మాం 🎵

                                                                                                by M.Murali Mohan


పల్లవి

రాఘవేంద్ర! రాఘవేంద్ర! రాఘవేంద్ర! పాహి మాం!
రాఘవేంద్ర! రాఘవేంద్ర! రాఘవేంద్ర! రక్ష మాం!


చరణం 1

శంభుకర్ణ! ప్రహ్లాద వరద! రాఘవేంద్ర! పాహి మాం!
మంచలా దేవి మంత్రాలయ వాస! రాఘవేంద్ర! రక్ష మాం!


చరణం 2

భక్త కోటి అభీష్ట వరద! రాఘవేంద్ర! పాహి మాం!
అనంత కోటి అభయ ముద్రా! రాఘవేంద్ర! రక్ష మాం!


చరణం 3

వేదాంత వేత్త! తపోఫల నిధే! రాఘవేంద్ర! పాహి మాం!
బృందావన వాస! జగత్గురువే! రాఘవేంద్ర! రక్ష మాం!


చరణం 4

అనాథ నాథ! నిత్యాన్నదాత  ! రాఘవేంద్ర! పాహి మాం!
దారిద్ర్య నాశక! దుఃఖహరణ! రాఘవేంద్ర! రక్ష మాం!