బుధవారం, నవంబర్ 04, 2020

సిద్దంకావలసివస్తుంది

ఆలోచనావిధానాలలో 

                చాలా చాలా  మార్పులు కావాలి 

అహంకారాలను అభిజాత్యాలను 

           దాటుకొని మనిషి ఎదిగాల్సిన సమయం యెంతో  దూరంలో లేదు   

దేవునిపేరుతో ,మతం పేరుతొ ,               

               ఏదో ఒక ఇజం పేరుతొ సమాజంలో పేరుకుపోతున్న ఈ హింస తగ్గాలి 

మంచిని మంచితనాన్ని పెంచే బదులు 

             ఏదో ఒక రూపంలో  సమాజంలో హింసను క్రూరత్వాన్ని పెంచి పోషిస్తున్నాము 

మనము మనముగా 

             ఆలోచించే  సమయం ఆసన్నమైనది అందుకు అందరు సిద్దంకావలసివస్తుంది 


మంగళవారం, నవంబర్ 03, 2020

స్వేచ్ఛ

స్వేచ్ఛ 

అది గాలిలా  ఉంటుందా  - 

ఎక్కడపడితే అక్కడకి ఎలాపడితే అలా పోవటానికి  

అది నీరులా ఉంటుందా -

పల్లాలవైపు దొర్లుకుంటూ జల జల జారీ పోవటానికి 

అది అగ్ని లా ఉంటుందా -

భగభగలతో  సెగలతో కనిపించినదెల్ల కాల్చుకుంటూపోవటానికి 

ఇవేవీ కావు - 

స్వేచ్చ - మనం పీలుచుకొనే ఊపిరిలా ఉంటుంది 

ఇతరులకు భంగం కలగకుండా మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది