ఆలోచనావిధానాలలో
చాలా చాలా మార్పులు కావాలి
అహంకారాలను అభిజాత్యాలను
దాటుకొని మనిషి ఎదిగాల్సిన సమయం యెంతో దూరంలో లేదు
దేవునిపేరుతో ,మతం పేరుతొ ,
ఏదో ఒక ఇజం పేరుతొ సమాజంలో పేరుకుపోతున్న ఈ హింస తగ్గాలి
మంచిని మంచితనాన్ని పెంచే బదులు
ఏదో ఒక రూపంలో సమాజంలో హింసను క్రూరత్వాన్ని పెంచి పోషిస్తున్నాము
మనము మనముగా
ఆలోచించే సమయం ఆసన్నమైనది అందుకు అందరు సిద్దంకావలసివస్తుంది