రామ చంద్రుని చేరగానే . అన్న పట్ల వున్నా గౌరవ భావం తో మర్యాదపూర్వకముగా పలికిన మొట్ట మొదటి మాట
త్వం ఇవ రాజా ఇతి రామం ధర్మజ్ఞా = యిప్పటికి ఈ భూమండలానికి నీవే రాజువు ధర్మజ్ఞా రామా
ఎంతో మనస్తాపాలు , మనఃక్లేసాలు చెంది వున్నప్పుడు , వాటిని పోగొట్టే విధముగా సంభాషణ వుండాలి అనే దానికి ప్రతీక ఈ మొదటి మాట త్వం ఇవ రాజా ఇతి .
మాట తీరు , మర్యాద మనన్న మనసుకు ఊరట కలిగించే మాట .
రాజ్యం నాకు ఇచ్చాడు , నేను తిరిగి దానం ఇస్తేనే రాముడు రాజు అనే భావం తో వచ్చాడా , పశ్యతాపముతో వచ్చాడా అనే తెలియజేసేది మన మాట తీరే . అది ఏ విధముగా చెప్పాలి అనేదే వాల్మీకి మహర్షి మనకు నేర్పించారు .